Tuesday, April 20, 2010

महति पादवॆदना । మహతి పాదవేదనా|

किमर्थं वृथा व्ययः इति?
కిమర్థం వృథా వ్యయః ఇతి?
యెందుకిలా వృధా వ్యయము?
Why waste money unnecessarily ?

ऎतत् समीचीनमस्ति वा?
ఏతత్ సమీచీనమస్తి వా?
ఇది సరిగ్గా వుందా?
Is it good ?

ऎवमपि अस्ति वा?
ఏవమపి అస్తి వా?
ఇల్లాగా?
Is it like this ?

सफलतायै अभिनंदनम् ।
సఫలతాయై అభినందనమ్|
సఫలత వల్లన (సాధించినందుకు) అభినందనలు
Hearty congratulations on your success.

महति पादवॆदना ।
మహతి పాదవేదనా |
విపరీతమైన కాలినొప్పి.
Terrible leg pain.

भवतः लॆखिनी कुत्र?
భవతః లేఖినీ కుత్ర?
మీ లేఖిని యెక్కడ వుంది?
Where is your pen ?

7 comments:

  1. Bhaskar gaaru,
    Thank you for your previous comment on "manta nakka" ! manta nakkaa? hahahaha.I've the latest version.I also enabled a transliteration tool(google transliterate) on firefox.But it's not working in this comment box.I'll look into it soon.

    One more correction :

    भवतः लॆखिनी कुत्र?
    భవతః లేఖినీ కుత్ర?
    మీ లేఖిని యెక్కడ వుంది?
    Where is your pen ?

    It's not apt to end this sentence with kutra.It seems incomplete.

    The question should have been - భవతః లేఖినీ కుత్ర asthi or kutraasthi ( by sandhi rule - savarna dheerghaha )

    ReplyDelete
  2. మేష్టారూ
    మీరు ఇర్గ దీస్తున్నారు. మీ ఈమెయిల్ ఇవ్వమని మనవి. మీతో ఓ గూగుల్ పత్రం పంచుకొనగల వాడాను. అందు, మేము అందింపదలచిన ప్రతి పదార్ధాల యందు తప్పులున్న ఎడల మీరు వాటిని సవరించవచ్చును అదీ మీ ఉచిత సమయమునందే సుమా.
    నేను ఈ బ్లాగు కర్తను మాత్రమే, నా వెనుక కనిపించని మిత్రబృందం పెద్దదే యున్నది కానీ, సమయాభావం చేత, కడు సమయం వెచ్చింపలేకుంటిమి అని తెలియజేయుటకు చింతించుచున్న వాడను.

    ReplyDelete
  3. >>.But it's not working in this comment box
    కేవలం ఈ బ్లాగ్ కామెంటు బాక్స్ లో పని చేస్తల్లేదా? ఆశ్చర్యంగా ఉందే.
    అడ్మిన్.వెబ్స్పియర్@జిమెయిల్.కాం, admin.websphere@gmail.com కి మెయిల్ ఇవ్వండి, మీ మంటనక్క సమస్యేంటో చూద్దాం.

    ReplyDelete
  4. @మధు గారు:
    భవతః లేఖినీ కుత్ర?

    ఈ వాక్యం సరైనదే. సంస్కృతంలో ప్రతి వాక్యమూ క్రియతో అంతమవాలన్న నియమం లేదు. మీరు సూచించిన వాక్యం "భవతః లేఖినీ కుత్ర అస్తి?" కరెక్టే అయినా చివర "అస్తి" అవసరం లేదు.

    - తెలుగు వాక్య నిర్మాణమూ, సంస్కృత వాక్య నిర్మాణం అనేక సందర్భాల్లో ఒకలానే ఉంటాయి. ఉదా: "ఇదం మమ పుస్తకం" అంటే "ఇది నా పుస్తకం". "ఇదం మమ పుస్తకం అస్తి" అనగా "ఇది నా పుస్తకమై ఉన్నది" - ఇటువంటి వాక్య నిర్మాణం అవసరం లేనిది.

    అందువల్ల పై వాక్యం కరెక్టే అని మా భావన.

    ReplyDelete
  5. రవి గారు,మీరు చెప్పింది సమంజసం గానే తోస్తోంది. నేను తప్పులో కాలేసి ఉంటాను.నేను దాదాపు అన్ని వాక్యాలు అస్తి తో ముగియడమే చూడడం ఒక కారణం అయితే,
    రెండోది -
    భవతః లేఖినీ కుత్ర? - అయ్యా, మీ పెన్ ఎక్కడ ? అని
    భవతః లేఖినీ కుత్ర అస్తి అంటే మీ పెన్ ఎక్కడ ఉంది అని.

    మీ పెన్ ఎక్కడ , మీ పెన్ ఎక్కడుంది ? ఇందులో నాకు రెండో వాక్యమే కొంత ఎక్కువ సబబుగా తోచటం రెండో కారణం. ( మొదటిది తప్పు kaapoyinaa, ఎందుకో అసంపూర్ణంగా అనిపిస్తోంది - అందులో informal tone వల్లేమో.

    "ఇదం మమ పుస్తకం అస్తి" ఉదాహరణ లో, మీరు చెప్పింది నా మొదటి కారణం తప్పని తేల్చేసింది. రెండోది కొంచెం సందేహం గానే ఉంది ?

    భాస్కర్ గారు, problem పోయే పోచె, ధన్యవాదాలు.
    ఇకపొతే, రవి గారి లాంటి పండితులు సరిదిద్దటం బాగుంటుందేమో నా కన్నా. ఆయన సంస్కృతంలో శ్లోకాలు కూడా రాస్తారు ! నేను రవి గారి సంస్కృత పరిజ్ఞానానికి పెద్ద పంఖాని.ఏదో ఒక రోజు, ఆయనలా శ్లోకాలు రాసెయ్యాలని చిన్ని ఆశ.

    ReplyDelete
  6. మధు గారు, పొఱబాటు పడ్డారు. నేను పండితుణ్ణి కాను, శ్లోకాలూ వ్రాయలేదు. అయితే సంస్కృతం కొద్దిగా తెలిసిన వాణ్ణి అంతే.

    ఇక్కడ తప్పులు వస్తున్నాయని నాకూ తెలుస్తూంది. తప్పుల ద్వారానైనా కొంచెం నేర్చుకుందాం. రాజు గారన్నట్టు, మీరూ ఓ చేయి కలిపితే సంతోషమే. :-)

    ReplyDelete
  7. రవి గారు,

    >> నేను పండితుణ్ణి కాను, శ్లోకాలూ వ్రాయలేదు.

    నాకెందుకో మీ బ్లాగులో మీరు రాసిన శ్లోకాలూ ఎప్పుడో చదివినట్టు గుర్తుంది.మీ బ్లాగు మొత్తం మళ్ళీ తిరగేయ్యాలి అంటారా ? :-)

    >>తప్పుల ద్వారానైనా కొంచెం నేర్చుకుందాం.
    నాగమురళి గారిని కూడా పిలిస్తే బాగుంటుంది ఏమో.కనీసం ఒకరు తప్పు చెపితే ( ఒక్కో సారి అందరమూ తప్పు చెప్తుంటే ), పక్క వారికి తెలిస్తే సరి దిద్దితారు కదా.

    తప్పకుండా నేనూ ఒక చెయ్యి వేస్తాను. భాస్కర్ గారికి ఇప్పుడే ఈమెయిలు పంపిస్తాను.

    ReplyDelete