పుస్తకాని సమాప్తాని |
पुस्तकानि समाप्तानि |
పుస్తకాలు ఐపోయాయి (లేవు)
The book is out of stock.
దశవారం పఠితవాన్. తథా2పి న స్మరామి |
दशवारं पठितवान्, तथापि न स्मरामि |
పదిసార్లు చదివాను, ఐనా గుర్తు లేదు
I read it ten times, even then I do not remember.
కరముక్తం ఇతి దృష్టవానః |
करमुक्तं इति दृष्टवान् |
సుంకము (MORE TRADITIONAL TELUGU WORD) లేదు అని చూసాను
I just saw that it is tax-free.
దినత్రయమ్ తత్ర తిష్టవానః |
दिनत्रयं तत्र स्थितवान् |
మూడు రోజులపాటు అక్కడ ఉన్నను
I stayed there for three days.
पञ्चनिमॆषॆषु ऎतद् कृत्वा ददामि |
పఞ్చనిమిషేషు ఎతద్ కృత్వా దదామి |
ఐదు నిమిషాలలో ఇది చేసుకుని ఇచ్చేస్తాను
I'll get it done in five minutes.
तथैव इति न नियमः |
తథైవ ఇతి న నియమః |
అలాగే అన్న నిమయము లేదు.
It is not like that.
Wednesday, April 21, 2010
Subscribe to:
Post Comments (Atom)
पञ्चनिमॆषॆषु ऎतद् कृत्वा ददामि |
ReplyDeleteపఞ్చనిమిషేషు ఎతద్ కృత్వా దదామి |
ఐదు నిమిషాలలో ఇది చేసుకుని వచ్చేస్తాను (ఇచ్చేస్తాను)
ఇచ్చేస్తాను అనేది రైటు.
మా ఈ ప్రయత్నంలో రవి గారిదికూడా ఓ హస్తం ఉందని మీకు నేను చెప్పితీరాలి మధు గారూ
ReplyDeleteచ్చక్కగ్గా తెలుగులో క్కుమ్మేస్తున్నారు.
మహాన్ సంతోషః.
ఈ సారి మధు గారే రైటు.
ReplyDeleteమార్చేసాను
ReplyDeleteనాకు సంస్కృతం రాదు కాబట్టి కొన్ని సందేహాలు:
ReplyDeleteపుస్తకాని సమాప్తాని అంటే "The book is out of stock" అనే అర్థం వస్తుందా? అక్కడ సమాప్త బదులు "నిశ్శేషిత" లాంటి క్రియ వాడాలేమో?
"ఐదు నిమిషాలలో ఇది చేసుకుని ఇచ్చేస్తాను" - "I'll get it done in five minutes.". ఇక్కడ తెలుగు వాక్యానికి ఇంగ్లీషు వాక్యం ఇచ్చే అర్థం రాదు కదా? సంస్కృత వాక్యంలో ఆ అర్థం వస్తుందా?
కామేశ్వర రావు గారూ,
ReplyDeleteపుస్తకాని సమాప్తాని అంటే పుస్తకాలు ( సమాప్తం అంటే చదవటం ఐపోయాయి అనుకోవాలేమో ఈ సందర్భంలో ) ఐపోయాయి అని మాత్రమే. నిజమే, మీరు భలే క్యాచ్ చేసారు.
ఇంగ్లీష్ లో, out of stock అనే అర్థం రాదు.
ఆ అర్థం రావాలంటే, మీరు అన్నట్టు పుస్తకాని నిశ్శేషితాని అనాల్సి వుంటుంది.
లేదా, పుస్తకాని ఆపణేన( షాపులో ) న లభతి అనవచ్చు.
రవి గారూ, నిన్న మీరు చెప్పిందే రైటు, నేను అనవసరంగా తికమక పడ్డాను.
"No Books Left" అనవచ్చా? అమ్మకానికా చదవటానికా అనేది వాళ్ళ ఇస్టం
ReplyDeleteభాస్కర్ గారూ,
ReplyDeleteనా అభిప్రాయంలో ,No books left ఇంచు మించు స్టాక్ లేదు అన్నట్టే అనిపిస్తోంది. కనుక మూల వాక్యం మార్చటమే సబబేమో.
The books are (done with)/ finished. కొంచెం దగ్గరగా ఉంది కానీ, పుస్తకాని సమాప్తాని లాగే, ఇది కూడా అసంపూర్ణ వాక్యం.
కామేశ్వర రావు గారూ,
ReplyDelete>>"ఐదు నిమిషాలలో ఇది చేసుకుని ఇచ్చేస్తాను" - "I'll get it done in five minutes.". ఇక్కడ తెలుగు వాక్యానికి ఇంగ్లీషు వాక్యం ఇచ్చే అర్థం రాదు కదా? సంస్కృత వాక్యంలో ఆ అర్థం వస్తుందా?
------------
ఐదు నిమిషాల్లో ఈ పని చేసుకుని ఇచ్చేస్తాను అనేది సంస్కృత వాక్యానికి అసలు అర్థం.
I'll get it done in five minutes. అనేది సరైన ఆంగ్ల అనువాదం కాదు.దాని బదులు, I'll return this to you after finishing this work in five minutes అనటం రైటు.
సూక్ష్మంగా
ReplyDeleteపుస్తకాని సమాప్తాని అంటే పుస్తకాలు లేవు
ఎవరైనా వాళ్ళ వాళ్ళ ఉపయోగాన్నిబట్టి వాడేస్కునేలా...
నా ఉద్దేశం -
అయ్యా నేను అలా వెళ్ళి నడుచుకుంటూ నాలుగోలైను పదునాలుగో అడ్డరోడ్డులోని చాయ్ దుకాణంలో ఓ వేడి చాయ్ తాగుదామనుకుంటూన్నాను, మీరూ దయచేసి, పెద్దమనసుతో నాతో వేంచేస్తే చాలా అత్భుతంగా ఉంటుంది, కనక వస్తారా అంటానికీ
బాబాయ్ పద చాయ్ తాగుదాం అంటానికీ ఓ పెద్ద తేడా ఏమీలేదు అని.
పుస్తకాని సమాప్తాని - ఇక బొక్కులేవ్.
కొంటానికి ఏమీ మిగల్లేదు మీరు దయచేయండి అనే సందర్భానికీ,
ఏరా రామూ పుస్తకాలు సదవటంలేదా వెధవా అంటే
ఇహ సదవాల్సిన పుస్తకాలు లేవు అనే సందర్భంలో కూడా వాడేస్కోవచ్చని నా అభిప్రాయం.
:):)
భాస్కర్ గారు,
ReplyDeleteనా అనుమానమల్లా "పుస్తకాని సమాప్తాని"కి "పుస్తకాలు లేవు" అన్న అర్థం వస్తుందా అనే. "పుస్తకాలు ముగిసాయి" (Books are finished) అన్నది దాని true translation అనుకుంటున్నాను. అయితే కొన్ని సార్లు true translation కాక వాడుకలో వేరే అర్థం వచ్చే అవకాశం ఉంది. అలా సంస్కృతం వాడుకలో దానికి "పుస్తకాలు లేవు" అనే అర్థం ఉన్నదా అని నా ప్రశ్న. ఉంది అంటే సమస్య లేదు.
భాస్కర్ గారూ,
ReplyDeleteకామేశ్వర రావు గారు చెప్పింది నిజమండీ.
పుస్తాకాలు ఐపోయాయి ( చదవడం ) అనే వస్తుంది.
పుస్తాకాలు లేవు అనటానికి పుస్తకాని సమాప్తాని అనేది సరైన
వాడుక కాదు.
తెలుగు లో ఉన్న సౌలభ్యం వల్ల, మీకు రెండూ ఒకటే అనిపిస్తోంది.
పుస్తకాలు లేవు అంటే తెలుగు లో కూడా చదవటానిక, అమ్మతానికా తెలియదు.
కానీ సంస్కృతంలో, అలా కాదు, ఇంగ్లీష్ లో లా.
పుస్తకాలు స్టాక్ లేదు కి, పుస్తకాలు చదవటం ఐపోయింది కి వేరు వేరు వాక్యాలు ఉంటాయి.
పుస్తకాని సమాప్తాని అనేది చదవటం ఐపోయింది అనే దానికే సరిపోతోంది అర్థం విషయం లో .
>>పుస్తకాని సమాప్తాని అనేది చదవటం ఐపోయింది అనే దానికే సరిపోతోంది అర్థం విషయంలో.
ReplyDeleteఅంటే ఓ కన్క్లూజన్ కి వచ్చినట్టేనా?
"పుస్తకాని సమాప్తాని" అనే వాక్యాన్ని చివరగా ఏమన్నా మార్పులకు గురిచేయాలంటారా?
అవును సార్ ,పుస్తకాని సమాప్తాని అనే వాక్యానికి మీరు ఏ అర్థం కావలి అనుకుంటున్నారో చెప్తే, alaa maaruddam.
ReplyDeletepustakaani samaaptaani ante pustakaalu ఫినిష్ అయ్యాయి ( చదవటం ) అని అర్థం. ఇంగ్లీష్ లో, The books are (done with)/ finished.
మీకు స్టాక్ ఐపోయాయి అనే అర్థం రావాలంటే, పైన కామెంట్స్ లో నేను చెప్పిన వాక్యం రాయొచ్చు.